ది సెస్సో విజయం సాధించాలి
గ్రేస్ గ్రిట్ ఫిలమ్స్ బ్యానర్‌పై(Grace Grit Films banner) బీఎన్ రవి నిర్మాణంలో యశ్ రాజ్, మౌపియ గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో యశ్ రాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ది సెస్సో(Sesso)’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు హీరో ఆకాశ్ జగన్నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, గండిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్, ప్రభు రావులకోలు, నర్సింగ్, శ్రావణ్ రావులకోలు అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “ఈ మూవీ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. యశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి పుట్టిందే ఈ మూవీ’ అన్నారు. ‘ప్రతి ఒక్కరు ఈ సినిమా తప్పక చూడండి’ అని హీరోయిన్ మౌపియ గౌస్వామి కోరింది. ‘మేము ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డాం’ నిర్మాత బీఎన్ రెడ్డి చెప్పారు.