ఊహలు ఉరుములై..
నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘వృషకర్మ(Vrushakarma)’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక థ్రిల్లర్.. పురాతన రహస్యాలు, దాగి ఉన్న నిజాలు, ఉత్కంఠభరితమైన అంశాల చుట్టూ సాగుతుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక కాగా స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జయరామ్, సత్య, కియారా ఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
డిసెంబర్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో పాట ‘ఛలో పదవే’ను విడుదల చేశారు. ‘ఊహలు ఉరుములై గుండెలోన మోగుతున్నవే.. చూపులు చినుకులై కళ్లలోన జారుతున్నవే.. ఛలో పదవే.. ఛలో పదవే..’ అంటూ సాగుతోందీ గీతం. నాగచైతన్య, కియారా ఖన్నా మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాట చాలా అందంగా చూపిస్తుంది. అజనీష్ బీ లోక్నాథ్ స్వరపర్చిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, సాయి విఘ్నేశ్ ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బీ లోక్నాథ్; డీవోపీ: రాగుల్ డీ హెరియన్; ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల; ఎడిటర్: నవీన్ నూలి.