రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థులు

12-11-2026 | 03:32pm

ఎర్రుపాలెం నవంబర్ 12( విజయక్రాంతి): ఈ నెల 10 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వేమిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమవరం విద్యార్థులు పమ్మి.ఉస్మిత, క్రిస్టిపాటి .

ఓంకారయశ్విని, వేమిరెడ్డి. మౌనిక లు అత్యంత ప్రతిభను కనబర్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు కు ఎంపికైనార ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్  ఉపేందర్ , పి. డి నరాల.సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

వీరు ఈ నెల 13 తేదీ నుండి 14 వ తేదీ వరకు హైదరాబాద్ లోని మేడ్చల్ మల్కాజ్ గిరి లో జరిగే 70 వ ఎస్ జి ఎఫ్  యు/17 రాష్ట్ర స్థాయి ఖో -ఖో పోటీల్లో పాల్గొంటారు రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రాణించాలని భీమవరం సర్పంచ్ వంగల నాగేశ్వరరావు  ఏ ఏపీ సి  చైర్మన్ తులిసమ్మ  వైస్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాసరెడ్డి పాఠశాల సిబ్బంది గ్రామస్తులు అభినందించారు.

మరిన్ని వార్తలు