రైతులకు ఉచితంగా మొక్కజొన్న విత్తనాల పంపిణీ
15-11-2026 | 04:17pm
బెజ్జంకి, (విజయక్రాంతి): గ్రీన్ వేస్ అగ్రీ(Green Ways Agri) సహకారంతో పయనీర్ విత్తన కంపెనీ, సీఎస్సీ ఎఫ్పీవో బెజ్జంకి ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు ఉచితంగా మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులతో ఆర్థిక లాభాలు పొందాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో వీరాపూర్ సర్పంచ్ సతీష్, కంపెనీ ఏఎస్ఓ అశోక్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవి, చరణ్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.