యువత ఆలోచనలే దేశాభివృద్ధికి పునాదులు

07-11-2026 | 08:05pm

వెంకటాపూర్,(విజయక్రాంతి): 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా భాజపా అధ్యక్షుడు సిరికొండ బలరాం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్ లాల్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడు మాదరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యువ సంవాద్-వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని(Yuva Samvad Event) నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు విద్యార్థులు, యువతను ఉద్దేశించి మాట్లాడారు.. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర, దేశాభివృద్ధిపై బాధ్యత, నూతన ఆవిష్కరణలు, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నేటి యువతే రేపటి దేశ నాయకులని, ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు శ్రీను, బీజేవైఎం మండల అధ్యక్షుడు సోనాసింగ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు