విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలి

07-11-2026 | 10:48pm

- ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి) : నాగర్ కర్నూల్ మండలం(Nagarkurnool Mandal) తూడుకుర్తి గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కా రాజ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటయ్య, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు