కరోనా కంటే డేంజర్ గా ఎల్ నినో...
* జలసిరి పథకంలో నీటి నిలువ కుంటలు నిర్మించుకోవాలి..
* ప్రతి ఒక్కరూ నీటి పొదుపు వాడుకుంటేనే ఎల్ నినో ఎదుర్కోగలం...
* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివాసులకు హితవు...
ఉట్నూర్, నవంబర్ 07( విజయక్రాంతి): గతంలో వచ్చిన కరోనా వ్యాధి(Coronavirus disease) కంటే ప్రస్తుతం వచ్చిన ఎల్ నినో డేంజర్ గా ఉందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్MLA Bojju Patel అన్నారు. శనివారం రాజ్ గోండు సేవా సమితి(Raj Gond Seva Samiti) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తో కలిసి ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్గావ్, పిప్పిరి గ్రామాల్లో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తుందని గుర్తు చేశారు. కరోనా కంటే డేంజర్ గా ఉన్న ఎల్ నినో ప్రతి ఒక్కరూ... ఎల్ నినో ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉండడంతోపాటు నీటి పొదుపును ఇప్పటి నుంచే పాటించాలని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జలసిరి కార్యక్రమంలో ఇంకుడు గుంతలు, నీటి నిల్వ కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎత్మాసూర్ దేవత కోసం పూజా సామాగ్రికి అవసరమయ్యే వాటి కొరకు ఒక్కొక్కదండానికి 15000 చొప్పున ఉమ్మడి జిల్లాలోని వెయ్యి దండారీలకు డబ్బులు అందజేస్తున్నామని గుర్తు చేశారు.
రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ ... ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ... పిల్లలను చదివించాలన్నారు. పండగల పేరుతో పిల్లలు ఇంటికి వచ్చి వారాల కొద్ది పాఠశాలకు వెళ్లడం లేదన్నారు. పిల్లలను చదివించడంతోపాటు నాలుగు సగ దేవుళ్ళను ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజించుకోవాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల దండారి గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.