ఎస్సీ,ఎస్టీ నాగిరెడ్డిపేట మండలం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

07-11-2026 | 10:38pm

నాగిరెడ్డిపేట్, నవంబర్ 7 (విజయక్రాంతి): మండల ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం(Mandal SC/ST Teachers' Association) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి దేవయ్య, ఉపాధ్యక్షులు రాందాస్, అసోసియేట్ ప్రెసిడెంట్  లూనావత్ రమేష్ నాయక్, మహిళా అధ్యక్షులు  సురేఖ,నవ్యసాయిశ్రీ కోశాధికారి రాకేష్ నాయక్, మహిళా కార్యదర్శి మాణిక్యమ్మ, సెక్రటరీలు నవీన్,    లచ్చిరామ్ నాయక్, సంతోష్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కనీరాం మెగావత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలు కన్నా నవభారత నిర్మాణం కేవలం విద్య ద్వారానే సాధ్యమని పేద అణగారిన పిల్లలకు నాణ్యమైన శాస్త్రీయ విద్యను అందించి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ  కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు