రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
- మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్
గుమ్మడిదల/ నవంబర్ 7 : రైతులకు(Farmers') ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు(Grain Procurement) సజావుగా చేపట్టాలని గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్(Gummadidala Municipal Chairman Chinnapani Kumar Goud) అధికారులకు సూచించారు.శనివారం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి జాప్యం జరగకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ,ధాన్యం విక్రయంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు,మున్సిపల్ వైస్ ఛైర్మన్ చిమ్ముల సంధ్య రెడ్డి, వార్డు కౌన్సిలర్లు మాధవి, రమేష్, గ్రామ రైతు సంఘం అధ్యక్షులు సదానంద్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు నర్సింగ్ రావు, మహిపాల్ రెడ్డి , హుసేన్, శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, రైతు సంఘం నాయకులు, గ్రామ రైతులు,తదితరులు పాల్గొన్నారు.