పుట్టినరోజు వేళ నిరుపేద ఆటో డ్రైవర్లకు బీమా భరోసా!

07-11-2026 | 10:45pm

చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ 

హుజురాబాద్,నవంబర్ 07:(విజయక్రాంతి) : పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా ఉంచి, నిరుపేద ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా నిలిచే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్(Jammikunta Municipal Chairman Molugu Prashanth Kumar Dileep). తన జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆటో డ్రైవర్ల(Auto drivers)కు రూ.5 లక్షల ప్రమాద బీమా(Accident Insurance) సౌకర్యం కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు ఆటో డ్రైవర్ మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని, అలాంటి కుటుంబాలకు బీమా ఒక భరోసాగా నిలుస్తుందని తెలిపారు. తన సోదరుడి తండ్రి ఆటో ప్రమాదంలో మృతి చెందినప్పుడు బీమా లేక కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులే ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. పట్టణంలోని ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా బీమా లేకుండా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

తన పుట్టినరోజున ఆటో కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించడం ఎంతో సంతృప్తినిచ్చిందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల సాగర్ రెడ్డి, జక్కే శివ, చింటూ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు