అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో 240 ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్
కాల్వశ్రీరాంపూర్,(విజయక్రాంతి): కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరుతూ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ, సహకారంతో కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో కోట్ల రూపాయలు వెచ్చించి 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు అర్హులైన పేదలకు వీటిని కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను పారదర్శకంగా గుర్తించి, తక్షణమే ఈ 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందజేసి వారి సొంతింటి కలను నెరవేర్చాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.