తుఫాన్ దెబ్బకు చెరువుల మరమ్మతులు: ఎమ్మెల్యే జారె చొరవ
రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే స్పందించిన ప్రభుత్వం
దమ్మపేట, నవంబర్ 07(విజయక్రాంతి): మురసు తుఫాన్(Cyclone Mora) ప్రభావంతో గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు చెరువులకు గండ్లు పడి రైతులకు(Farmers') తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా చెరువుల శాశ్వత, తాత్కాలిక మరమ్మతుల కోసం ఎఫ్డీఆర్ నిధుల కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. దమ్మపేట మండలంలో నాలుగు చెరువుల మరమ్మతు పనులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
నాగుపల్లి గ్రామంలో ముసలి బంధం చెరువు శాశ్వత మరమ్మతులకు రూ.49.80 లక్షలు, దమ్మపేట మండల కేంద్రంలోని పేరంటాల చెరువు మరమ్మతులకు రూ.47 లక్షలు, రాంజీ కుంట మరమ్మతులకు రూ.8.50 లక్షలు, ఆసన్నగూడెం గ్రామంలోని రంగన్న కుంట శాశ్వత మరమ్మతులకు రూ.39.50, లక్షలు ప్రభుత్వం కేటాయించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తుఫాన్ వల్ల దెబ్బతిన్న చెరువులకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం చూపుతున్న చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.