రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే తీసుకురావాలి
ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపి కృష్ణ
సిద్దిపేట రూరల్: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపి కృష్ణ అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్లి,సీతారాం పల్లి, ఇరుకోడ్, మాచపూర్ గ్రామాలలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి 2461, బీ గ్రేడు ధాన్యానికి 2441, సన్న ధాన్యం రకం కు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సెంటర్ నిర్వహకులకు సూచించారు.
రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, జనార్దన్ రెడ్డి, ఏపిఎం సాగర్,మార్కెట్ సెంటర్ ఇన్చార్జి హనుమంత రెడ్డి, సర్పంచ్ లు రోజా వీరేందర్ గౌడ్, చింతల రత్నాకర్ గౌడ్, ఉప సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.