26వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె

07-11-2026 | 10:35pm

ఆసిఫాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ(Telangana NHM JAC) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు(National Health Mission Employees) చేపట్టిన సమ్మె శనివారానికి 26వ రోజుకు చేరుకుంది. సమాన పనికి సమాన వేతనం, 60 ఏళ్ల ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులతో చర్చలు జరిగినప్పటికీ స్పష్టమైన హామీ రాలేదని జేఏసీ పేర్కొంది. డిమాండ్లపై స్పష్టమైన జీవో లేదా ఒప్పంద పత్రం అందించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు .

మరిన్ని వార్తలు