మదర్ ఫీడింగ్ సెంటర్ల ప్రారంభం

07-11-2026 | 11:53pm

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి(Government hospital), కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ సెంటర్ల(Mother Feeding Centers)ను శనివారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Dr. Kuchukulla Rajesh Reddy)లు ప్రారంభించారు. బాలింతలు, చిన్నారుల తల్లులు ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలకు పాలిచ్చేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ సునీంద్ర , వైస్ చైర్మన్ రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, పట్టణ అధ్యక్షుడు జక్కా రాజు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు