వసతి గృహ విద్యార్థుల కార్తీక మాస వనభోజనాలు

30-11-2026 | 12:05am

సూర్యాపేట, నవంబర్ 29 (విజయ క్రాంతి) : కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని సూర్యాపేట, కోదాడ డివిజన్(Suryapet, Kodad Division) పరిధిలో గల ఎస్సీ వసతి గృహాల విద్యార్థులు ఆదివారం కార్తీక వనభోజనాలకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు(Students) వనభోజనాలు చేసి, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో(Games, songs, cultural programs) ఎంతో ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులలో స్నేహభావం, క్రమశిక్షణ, ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని  జిల్లా షెడ్యూలకులముల అభివృద్ధి అదికారి కె.లత తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు