ట్రాక్టర్ పల్టీ రైతు మృతి
* లక్ష్మీతండాలో ఘటన
సూర్యాపేట రూరల్, నవంబర్ 29: పొలం దున్నుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ(Tractor overturned) కొట్టగా రైతు మృతి(Farmer dies) చెందిన ఘటన సూర్యాపేట మండలంలోని(Suryapet Mandal) లక్ష్మీ తండాలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని లక్ష్మీతండా(Lakshmithanda) గ్రామానికి చెందిన లూనావత్ లచ్చు (33) అనే రైతు ఆదివారం ఉదయం తన సొంత వరి పొలాన్ని ట్రాక్టర్ (టీఎస్ 29 టి 9295) తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు వాహనం ఒక్కసారిగా పల్టీ కొట్టిందన్నారు.
దీంతో ట్రాక్టర్ స్టీరింగ్, కల్టివేటర్ ల మధ్య లచ్చు ఇరుక్కుపోవడం గమనించిన చుట్టుపక్కల రైతులు ట్రాక్టర్‌ను తొలగించి బయటకు తీసేలోపే అతను మృతి చెందాడన్నారు. మృతుడి భార్య లూనావత్ సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎం. అనిల్ రెడ్డి తెలిపారు. కాగా మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.