రాష్ట్రానికి పెట్టుబడుల జాతర.. ఏఐ డేటా సెంటర్‌కు ఓకే

10-11-2026 | 04:49pm

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ పెట్టుబడులు, ఏఐ డేటా సెంటర్లు, బ్యాటరీ తయారీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా విశాఖ జిల్లా భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భారీ పెట్టుబడులకు కేబినెట్ ఓకే

  • రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఐప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆమోదం తెలిపింది.
  • నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
  • భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు అనుమతి ఇచ్చింది.
  • పశ్చిమగోదావరిలో రావళి స్పిన్నర్స్ పరిశ్రమ విస్తరణకు రూ.237 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది.

రిలయన్స్, హెటెరోకు కీలక కేటాయింపులు

పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపులపైనా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాలు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ కోసం 24.96 ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పార్క్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.

వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కు ప్రతిపాదన

విజయవాడలో 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా కేబినెట్ పరిశీలించింది. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు నగర వ్యర్థాల నిర్వహణకు ఉపయోగపడే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిశ్రమలు, తయారీ రంగాన్ని విస్తరించే దిశగా కేబినెట్ నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విశాఖలో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ నేపథ్యంలో ఈ నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక రంగంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

మరిన్ని వార్తలు