కేజ్రీవాల్‌కు ప్రాణహాని
కేజ్రీవాల్, కుమార్తెకు డెత్ థ్రెట్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని రాజకీయాల్లో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఫోన్ కాల్, WhatsApp మెసేజ్ ద్వారా ఈ Threat వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. రూ.7 కోట్లు ఇవ్వాలని, లేదంటే కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను కూడా హతమారుస్తామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీలోని తిలక్ నగర్ నియోజకవర్గం ప్రతినిధి జర్నైల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న పంజాబ్‌లోని మొహాలీ పోలీసులకు ఇచ్చిన Complaint ప్రకారం.. విదేశాల్లో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్న ఓ వ్యక్తి తనకు ఫోన్ చేయడంతో పాటు WhatsApp సందేశం పంపినట్లు ఆయన తెలిపారు. ఆ వ్యక్తి తనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా మొహాలీ పోలీసులు BNS, IT Act కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును Cyber Crime విభాగానికి చెందిన అధికారి సునీల్ కుమార్‌కు అప్పగించినట్లు సమాచారం. బెదిరింపులకు ఉపయోగించిన మొబైల్ నంబర్‌కు సంబంధించిన Call Records, IP Logs, Location Dataను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేజ్రీవాల్, ఆయన కుటుంబానికి తగిన Security కల్పించాలని జర్నైల్ సింగ్ కోరారు. మరోవైపు జైలు నుంచే నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడనే ఆరోపణలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గతంలో వివరాలు వెల్లడించింది. గోల్డీ బ్రార్‌తో పాటు విదేశాల్లో ఉన్న నేరగాళ్లు, వివిధ రాష్ట్రాల్లోని స్థానిక షూటర్లు, Safe Houses ద్వారా నెట్వర్క్ పనిచేస్తున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే కేజ్రీవాల్‌కు వచ్చిన తాజా బెదిరింపుల వెనుక నిజంగా ఈ గ్యాంగ్ హస్తం ఉందా? లేక వారి పేరు ఉపయోగించుకుని ఎవరైనా వసూళ్లకు ప్రయత్నించారా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.