దావూద్ ఇంటిపై బుల్డోజర్

20-11-2026 | 05:00am

బీఎంసీ చర్యలపై స్టే విధించిన బాంబే హైకోర్టు

ముంబై, నవంబర్ 19: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముంబై బేండీబజార్‌లోని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim), పూర్వీకుల ఇంటి (ముసాఫిర్‌ఖానా)పై గురువారం బుల్డోజర్ చర్యలు చే పట్టింది. కూల్చివేత ప్రారంభించింది. కూల్చివేత సందర్భంగా బీఎంసీ భారీ పోలీసు బం దోబస్తును ఏర్పాటు చేసి ఈ చర్యలు చేపట్టింది. కూల్చివేతపై ఎస్‌బీయూటీ (సైఫీ బు ర్హానీ అప్లిప్ట్‌మెంట్ ట్రస్ట్) బాంబే హైకోర్టును ఆశ్రయించి పనులను నిలిపివేయించింది.

ఈ స్థలం పునరాభివృద్ధి ప్రాజెక్టు పరిధిలోకి వస్తున్నందునే కూల్చివేస్తున్నట్లు బీఎంసీ వాదించగా, వక్ష్‌బోర్డు, ప్రైవేటు ఆస్తిగా ఎస్‌బీయూటీ వాదిస్తూ కూల్చివేతపై స్టే తెచ్చు కుంది. తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 25కు వాయిదా వేసింది. అంతవరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కూల్చివేత చేపట్టొద్దని బీఎంసీని ఆదేశించింది. 1986లో దావూద్ ఇబ్రహీం భారత్‌ను విడిచే ముందు 1970, 80 ప్రాంతంలో అతని కుటుంబం ఈ భవనంలోనే నివసించింది. ఎస్‌బీయూటీ స్టే తీసుకురావడానికి ముందే సగం ఇంటిని బీఎంసీ కూల్చివేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు