డీజిల్, ఏటీఎఫ్‌పై ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ పెంపు
- డీజిల్‌పై రూ. 2.50, ఏటీఎఫ్‌పై రూ. 1.50 అధికం
- దేశీయంగా వాహనదారులకు వర్తించదు
- కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
న్యూఢిల్లీ, నవంబర్ 17: విదేశాలకు ఎగుమతి(Export to foreign countries) చేసే డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(Diesel, Aviation Turbine Fuel) (ఏటీఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ(Excise duty) (ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్)ని పెంచింది. డీజిల్‌పై రూ. 2.50, ఏటీఎఫ్‌పై రూ. 1.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై(Petrol) ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ పెంపుతో లీటర్ డీజిల్‌పై ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్(Export Tax) రూ. 11.50 నుంచి రూ. 14కు చేరుకుంది. విమానాలకు(aircraft) వాడే ఏటీఎఫ్‌పై రూ. 11 నుంచి రూ. 12.50కి చేరుకుంది.
నవంబర్ 16 అర్ధరాత్రి నుంచి పదిహేను రోజుల పాటు ఇది అమలులో ఉంటుందని కేంద్రం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులకు తగ్గట్టు దీన్ని సవరించినట్లు వెల్లడించింది. దేశీయంగా వాహనదారులకు అమ్మే పెట్రోల్, డీజిల్‌పై ఈ ధరల ప్రభావం ఏమీ ఉండదని.. వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదని.. కేవలం ఎగుమతులకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
* మన దేశంలోని క్రూడాయిల్ రిఫైనరీ సంస్థలు విదేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకొని డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్‌గా శుద్ధి చేస్తుంటాయి. దీన్ని దేశీయంగా వాడటంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తుంటాయి. అయితే.. విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేయకుండా, స్థానికంగా వినియోగించుకునే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్ డీజిల్, ఏటీఎఫ్‌పై ట్యాక్స్‌ను పెంచినట్లు కేంద్ర వర్గాలు చెప్తున్నాయి.
* అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినప్పుడు స్థానిక ఆయిల్ కంపెనీలు అసాధారణంగా లాభాలు అర్జిస్తుంటాయి. ఆ లాభాలపై పన్ను విధించేందుకు 2022 జులైలో తొలిసారిగా విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని కేంద్రం తీసుకువచ్చింది. తర్వాత రెండేండ్లకు దాన్ని రద్దు చేసింది.
అయితే.. ఫిబ్రవరి నుంచి పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం కొనసాగడంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. విండ్‌ఫాల్ ట్యాక్స్ పరిధిలోనే తాజాగా పెంచిన ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్) వస్తుంది. పదిహేను రోజులకోసారి దీన్ని కేంద్రం సవరిస్తూ ఉంటుంది.