calender_icon.png 3 December, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పెళ్లి పీటలెక్కిన సమంత

02-12-2025 02:06:15 AM

స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆమె పెళ్లి దర్శకుడు రాజ్ నిడిమోరుతో సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవాలయంలో జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక నిర్వహించటం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో పంచుకుంది. మరోవైపు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

వీరు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పర్చడానికి రూపొందించిన విశిష్టమైన ప్రక్రియే ఈ ‘భూత శుద్ధి వివాహం’ అని పేర్కొంది. లింగ భైరవి ఆలయాలు, ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ వివాహ క్రతువు నిర్వహిస్తారని తెలిపింది. కొంతకాలంగా సమంత నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

రాజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను సమంత పంచుకోవడం వారి వార్తలకు బలం చేకూర్చినట్టుయ్యింది. సమంత నటించిన ‘ది ఫ్యామి లీమ్యాన్ సీజన్2’, ‘సిటాడెల్: హనీబన్నీ’లను రాజ్ తెరకెక్కించా. ఈ ప్రాజెక్టుల కోసం కలిసి పనిచేసే సమయంలోనే రాజ్, సమంత మధ్య స్నేహం ఏర్పడింది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.