సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
14-07-2026 01:26 AM
వనపర్తి, జూలై 13 (విజయక్రాంతి): ఈ నెల 15న కొత్తకోటలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు విద్యార్థులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి అవసరమైన వేదిక, విద్యుత్, తాగునీరు, భద్రత, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అధికారులు హెలిప్యాడ్, సభా ప్రాంగణాన్ని పరిశీలించి సంబంధిత శాఖలకు సూచనలు చేశారు.






