14 July, 2026 | 4:50 AM

సన్న బియ్యం ఉత్తి మాటే.. మక్క పట్టిన దొడ్డు బియ్యమే దిక్కు

14-07-2026 01:26 AM

తాండూరు, జూలై 13,(విజయ క్రాంతి)పేదలకు రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు పేర్కొంటుండగా కొన్ని గ్రామాల్లో సన్న బియ్యానికి బదులుగా ముక్క పట్టిన దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం ఓంలా నాయక్ తండా రేషన్ దుకాణం లో మక్క పట్టిన దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో తినేందుకు పనికిరాకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ఎంపిటిసి గేమ్యా నాయక్ మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాల్లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని . . పాలకులు, అధికారులు చెబుతున్నది ఒకటని. .క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి అని.. జిల్లా ఉన్నతాధికారుల స్పందించి నాణ్యమైన సన్న బియ్యం  సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.