6 August, 2026 | 2:30 AM

కిలోన్నర గంజాయి స్వాధీనం

06-08-2026 01:44 AM

తాండూరు, ఆగస్టు 5,( విజయ క్రాంతి)వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతపూర్ తబ్రీజ్ పాలిసింగ్ స్టోన్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుండి దాదాపు కిలోన్నర ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మధ్య నిషేధ, అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన కతిహార్ జిల్లా  బైరియా గ్రామానికి చెందిన మమ్మద్ ముక్తకిం గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు  ఆయన తెలిపారు.