calender_icon.png 5 July, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట జిల్లా పోలీసులకు 16 పతకాలు

05-07-2025 01:07:44 AM

వరంగల్ (మహబూబాబాద్) జూలై 4 (విజయ క్రాంతి): భద్రాద్రి జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీమీట్ లో  మహబూబాబాబ్ జిల్లాకు పోలీసులకు 4 బంగారు, 9 రజత, 3 కాంస్య పతకాలు లభించాయి. బాంబు స్క్వాడ్ విభాగంలో పిసిలు రామయ్య గోల్ , సిల్వర్, అశోక్ గోల్ , సిల్వర్, వి.మహేష్ గోల్ , సిల్వర్, ఏ.మహేష్ సిల్వర్,  రాములు గోల్ , వీడియో గ్రాఫర్ విభాగంలో పిసి కుషాల్ కుమార్ సిల్వర్, అబ్జర్వేషన్ విభాగంలో మధు సిల్వర్,

ఫింగర్ ప్రింట్ విభాగంలో ఎస్‌ఐ ప్రవీణ్ కాంస్య , పోలీస్ పోర్ట్రైట్ విభాగంలో పిసి మధు సిల్వర్, కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో పిసి సుమన్ సిల్వర్, అబ్దుల్ ఖధీర్ గోల్డ్, కాంస్య మెడల్స్ సాధించారు. మహబూబాబాద్ జిల్లా నుండి నోడల్ ఆఫీసిర్ గా డిఎస్పీ శ్రీనివాస్, కోచ్ గా బీడీ టీం పీసీ అంజయ్య టీం సభ్యులకు పతకాలను వరంగల్ పోలీస్ కమీషనరేట్ లోని రాణీ రుద్రమదేవి హాల్ లో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. పోలీసు డ్యూటీ మీట్ లో పతకాలు సాధించిన పోలీసులను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినందించారు.