calender_icon.png 5 July, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుస్థిర మైనింగ్ విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి

05-07-2025 01:08:27 AM

  1. బాధ్యతయుతమైన మైనింగ్ ప్రక్రియను నిర్వహించాలి 
  2. నిబంధనల సరళీకృతం, పర్యావరణ పరిరక్షణే మా ప్రాధాన్యత
  3. గనుల మూసివేత తర్వాత కూడా ప్రజోపయోగంగా ఉండాలి
  4. తమిళనాడు గనులను ఆదర్శంగా తీసుకోవాలి
  5. అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): సుస్థిరమైన మైనింగ్ విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి పట్ల, ప్రజల పట్ల బాధ్య తాయుతంగా వ్యవహరిస్తూ మైనింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుందని సూచిం చారు. వికసిత్ భారత్‌లో భాగంగా దేశంలోని వివిధ ఖనిజ పరిశ్రమలు తమ ఉత్ప త్తులు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పా రు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ అవసరాలకు అనుగుణంగా తగి నంత బొగ్గు, అల్యూమినియం, రాగి తదితర ఖనిజాలను ఉత్పత్తి చేసి, దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని అభిప్రాయపడ్డారు.

బొగ్గు గనులు మూత పడినప్పుడు కూడా ఆ ప్రాంత ప్రకృతికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలు చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు రాష్ర్టంలో కొన్ని గను లు ఈ విషయంలో దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని పేర్కొన్నారు. మూసి వేసిన గనుల ద్వారా స్థానిక ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంతోపాటు ఉపా ధి అవకాశాలు కల్పించారని, ఈ తరహా విధానాలను ఇతర పరిశ్రమల వారు కూడా ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.

దీని పై ప్రపంచవ్యాప్తంగా వీచ్చేసిన మైనింగ్ సంస్థల వారు, మైనింగ్ మేధావులు ఈ సదస్సులో తమ సూచనలు, సలహాలు ఇవ్వాల ని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన పరిశోధన సంస్థ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంట ర్‌తో అరుదైన మూలకాల పరిశోధన, ఉత్పత్తిపై సింగరేణి కాలరీస్ కంపెనీతో ప్రాథమిక అవగాహన ఒప్పదం కుదిరింది.

కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటి వరకు బొగ్గు, థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో రాణిస్తున్న సింగరేణి సంస్థ రాబోయే కాలంలో తన వ్యాపార విస్తరణ చర్యలను కీలక ఖనిజాలు, అరుదైన మూలకాల ఉత్ప త్తి రంగంలోనూ చేపట్టి దేశంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. కార్య క్రమంలో బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రూపేంద్ర బ్రార్, కోలిండియా చైర్మన్ పీఎం ప్రసాద్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, వివిధ పీఎస్‌యూల సీఎండీలు,  అధికారులు పాల్గొన్నారు. 

పర్యావరణహితంగా బొగ్గు తవ్వకాలు: సింగరేణి సీఎండీ ఎన్ బలరాం

పర్యావరణానికి నష్టం కలుగకుండా, ప్రజలకు ప్రయోజనకరంగా సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలను చేపడుతుందని సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. సమీప ప్రాం తాల అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోందని తెలిపారు. మైనింగ్ సదస్సు సందర్భంగా సింగరేణి తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ అవలంబిస్తున్న విధానా లను వివరించారు.

పర్యావరణానికి హాని కలిగించని మైనింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. భూగర్భజలాల పెం పుదల కోసం నీటి బిందువు సింధువు అనే కార్యక్రమాన్ని చేపట్టి 62 కొత్త చెరువులను నిర్మించినట్టు పేర్కొన్నారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రారంభించినట్టు వివరించారు.