calender_icon.png 8 November, 2024 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్ కార్మికుడిని పరామర్శించిన ఎంపీ రఘునందన్ రావు

07-10-2024 05:38:27 PM

పటాన్చెరు (విజయక్రాంతి): ఇటీవల దుండగుల చేతిలో గాయపడ్డ.. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బిహెచ్ఇఎల్ పరిశ్రమ కార్మికుడు కార్తీక్ చంద్ర మహపత్ ను సోమవారం సాయంత్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బీహెచ్ఈఎల్ పరిశ్రమలో కార్మికులపై దాడి జరగడం బాధాకరమని, పరిశ్రమలో రక్షణను మరింత బలోపేతం చేయాలని సంభందిత అధికారులకు సూచించారు. ఘటనకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎస్టేట్ అధికారులను కోరారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.