16-01-2026 05:37:05 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మకర సంక్రాంతి పండుగ వేడుకలు సంబురాలు అంబరాన్నంటాయి. తెలుగింట వాకిళ్ళు రంగువాళ్ళులతో శోభిల్లాయి. బెల్లంపల్లి ,కాసిపేట, తాండూరు బీమినీ నెన్నెల కన్నెపల్లి వేమనపల్లి మండలాల్లో ప్రజలు ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలిచిన పిండి వంటలు సకినాలి అర్షలు గారెలు ఆరగించారు. పిల్లలు,పెద్దలు పతంగులు ఎగరేశారు. సంక్రాంతి పండుగ భోగితో మొదలై కనమతో పండుగ వేడుకలు ముగిశాయి. కనుమ రోజు కుటుంబసమేతంగా విందులు సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఎక్కడచూసినా సంక్రాంతి పండుగ వేడుకల సందడి కనిపించింది. సంక్రాంతి సంబరాల్లో ప్రజలు ఆనందంగా పాల్గొన్నారు.