calender_icon.png 16 January, 2026 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ బీజేపీ

16-01-2026 06:10:04 PM

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ బీజేపీ(Telangana BJP) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని పిటిషన్ లో బీజేపీ వెల్లడించింది. సుప్రీంకోర్టు చెప్పినా పాటించలేదని బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు బీజేపీ ఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJP LP leader Alleti Maheshwar Reddy) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను కూడా ఏలేటి పిటిషన్ లో పొందుపరిచారు.