calender_icon.png 16 January, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి

16-01-2026 06:13:55 PM

రోడ్డు భద్రత నిబంధన లు పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ మన్మోహన్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నిబంధనలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మన్మోహన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశం హాలులో కామారెడ్డి రూరల్ సీఐ రామన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ మన్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని వాహన దారులకు సూచించారు. పోలీస్ పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, టీజీవో అధ్యక్షులు, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్, పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.