calender_icon.png 16 January, 2026 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు

16-01-2026 05:59:24 PM

హైదరాబాద్: సైబర్ క్రైమ్ పోలీసులకు నటి అనసూయ(Actress Anasuya) ఫిర్యాదు చేసింది. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్ లైన్ వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొంది. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు జరిగాయని వాపోయింది. నటి అనసూయ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై కేసులు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనసూయ ఫిర్యాదుతో బొజ్జ సంధ్యారెడ్డి, గోగినేని ప్రయాచౌదరి, పావని, శేఖర్ బాషా, రజిని,కరాటే కల్యాణి, విజయలక్ష్మి, యాంకర్ రోహిత్, ఓ ఛానెల్ యాంకర్, దుర్గ, యాంకర్ మనోజ్, ఇతర ఛానెళ్లు, ఆన్ లైన్ మీడియా పేజీలపై కేసు బుక్ చేశారు. అనసూయ నిందితుల పేర్లతో పాటు సోషల్ మీడియా లింకుల ఫిర్యాదుతో జత చేసింది.