calender_icon.png 16 January, 2026 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మంజా యువకుడికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

16-01-2026 06:23:19 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిషేధిత చైనా మంజతో బైక్ పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి, ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన కాసర్ల మహేందర్ అనే యువకుడు పెద్దపల్లిలో తన పనులు ముగించుకుని బైక్‌ పై హెల్మెట్ ధరించి స్వగ్రామమైన నారాయణపల్లికి పూసాల రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా చైనా మాంజా అతడికి తగిలింది.

మాంజా బలంగా తగలడంతో అది హెల్మెట్ గ్లాస్‌పైకి ఎగసి మరీ ముక్కు, కనుబొమ్మ చివర తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహేందర్‌ ను స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు.. నిషేధిత చైనా మాంజా కారణంగా ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...పోలీసులు వెంటనే స్పందించి చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.