17-09-2025 07:16:31 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని భాజపా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం,ప్రధానకార్యదర్శి అరిగెల మల్లికార్జున్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు,మొదటగా కేక్ కట్ చేసి,కార్యకర్తలకు స్వీట్స్ తినిపించారు. అనంతరం ప్రధాన మంత్రి 76 వ పుట్టినరోజు సందర్భంగా 76 మంది నరేంద్ర మోడీ అభిమానులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని వారి అభిమానులు,కార్యకర్తలు స్వచ్చందంగా రక్తదానం చేశారని అన్నారు,రక్త దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణ దానం చేసినవారు అవుతారని అన్నారు, నరేంద్ర మోడీ దేశ భద్రత కోసం కవచంలా ఉన్నారని అన్నారు,కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నారు,