calender_icon.png 17 September, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు

17-09-2025 07:20:05 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా బుధవారం రోజున కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరుకాగా, పార్టీ శ్రేణుల సమక్షంలో డా.కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కవ్వంపల్లి  సత్యనారాయణ మాట్లాడుతూ 1948 లో  హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది.

నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో రక్షణ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం సర్కార్ మెడలు వంచి హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసిన తర్వాత, 12 సంవత్సరాల క్రితం  కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ లాంటి వారితో పాటు ఎంతోమంది పోరాట యోధులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించి నేడు మనకు స్వేచ్ఛ వాయువులను అందించరని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, పత్తి మధుకర్ రెడ్డి, విక్టర్, అహమ్మద్  అలీ, కుర్ర పోచయ్య,  వెన్నం రజిత రెడ్డి, షబానా మహమ్మద్, హనీఫ్, హస్తపురం తిరుమల, బండారి తిరుపతి గౌడ్, కల్వల రామ్ చందర్, యనమల మంజుల, శ్రీరాముల రమేష్, ముల్కల కవిత యోనా, నూనె గోపాల్ రెడ్డి, నిహాల్ అహ్మద్, మాదాసు శ్రీనివాస్, చింతల కిషన్, మహమ్మద్ చాంద్, హసీనా, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పర్వత మల్లేశం, జ్యోతి శిల్ప, అడపసాగర్ కరీం తదితరులు పాల్గొన్నారు.