17-09-2025 07:12:55 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విశ్వకర్మ జయంతిని బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ట్రాలీపై విశ్వకర్మ చిత్రపటంతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీరాములు, వరప్రసాద్, తిరుపతి చారి ,సురేష్ చారి ,వెంకటయ్య, భాస్కరాచారి ,అశోక్, వేణుగోపాల్ ,బట్టుపల్లి సంతోష్ ,వెంకన్న ,నిఖిల్, మొండి, రాజు ,పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.