calender_icon.png 12 January, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో పాలకుర్తి ఎత్తిపోతల పనులు షురూ

12-01-2026 03:44:39 AM

అర్హులైన పేదలకు రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు 

పేదల జీవన ప్రమాణాల పెంపునకు కృషి

  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  2. రామగుండం నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తాం
  3. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  4. రామగుండంలో లబ్ధిదారులకు ‘డబుల్’ ఇండ్ల పంపిణీ 

రామగుండం, జనవరి 11 (విజయక్రాంతి): ప్రజల జీవన ప్రమాణాలు పెంచేం దుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి డిప్యూటీ సీఎం రామగుండంలో పర్యటించారు. వివిధ డివిజ న్‌లలో రూ.80.52  కోట్ల అభివృద్ధి పనులకు, టియూఎఫ్‌ఐడి ద్వారా రూ.88.90 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ సరఫరా, ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టనున్న రూ.6.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనం తరం నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 494 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

రామగుండం జూని యర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర క్యాబినెట్‌లోని మంత్రులందరిపై ఒత్తిడి పెంచు తూ రామగుండం ప్రాంతానికి అవసరమైన పనులు స్థానిక ఎమ్మెల్యే చేయించుకుంటున్నారని ప్రశంసించారు. పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రజా ప్రభుత్వం మొ దటి సంవత్సరమే 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుం దని చెప్పారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకా రం పాలకుర్తి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో చేపడతామని చెప్పా రు. మంత్రి శ్రీధర్‌బాబు కృషి మేరకు రాష్ట్ర క్యాబినెట్ రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ సంస్థ కాపాడేందుకు రేర్ ఎర్త్ మేటిరి యల్స్ మైనింగ్‌లో కూడా భాగస్వామ్యం అయ్యేందుకు ప్రణాళికలు తయా రు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు, జెన్ కో, డిస్కంలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీ మా కల్పించిందని, అదే రీతిలో రాష్ట్రంలో పనిచేసే ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోటి రూపాయల బీమా ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు.

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెర వేరుస్తున్నామని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభు త్వం దూరంగా ఉంటుందని గత ప్రభు త్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మౌలిక వసతులు కల్పించి అందిస్తున్నామని అన్నా రు. కార్పొరేషన్ పరిధిలో మరో తహసిల్దార్ నియమించే దిశగా క్యాబినెట్ లో అవసరమైన నిర్ణయం త్వరలో తీసుకుంటామని తెలి పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వెనుకబడిన రామగుండం ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ట్రాన్స్ జెండర్లకు పెన్షన్ మంజూరు విషయమై ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి మెడికల్ బోర్డు నుంచి కార్మికులకు ఎ దురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నా రు. చిన్నతనంలో తాము చదువుకున్న పాఠశాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని అన్నారు.

ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని ప్రతిపాద నలు పంపాలని మంత్రి ఎమ్మెల్యేకు సూచించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మె ల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు డి.వేణు, జే.అరుణశ్రీ, డిసిపి రాంరెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, పిడి హౌసింగ్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. 

వాణిజ, వ్యాపార సంస్థలు వృద్ధి చెందాలి: మంత్రి శ్రీధర్‌బాబు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రామగుండం ప్రాంతంలో ఉన్న నిరుపేదలు, యువకులు, కార్మికులకు మంచి చేయాలని ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే నిరంతరం పని చేస్తున్నారని, చివరి ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఉన్నారని ప్రశంసించారు. నగరంలో రోడ్డు వెడల్పు పనుల వల్ల నష్టపోయే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాణిజ వ్యాపార సంస్థలు నగరంలో వృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

అర్హత ఉండి ఇండ్లు రానివారు ఎవరు ఆందోళన చెందవద్దని, రాబోయే దశలలో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. 800 మెగా వాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం జన్ కో లేదా ఎన్.టి.పి.సి ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వైయస్సార్ హయంలో 18 వేల ఇండ్లకు క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేశామని, పెండింగ్ దరఖాస్తులను త్వరలోనే పరిశీలించి పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.