12-01-2026 03:39:50 AM
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): బీసీ, బహుజన, గిరిజన వర్గాల హక్కుల సాధన కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టిందని, ఆ లక్ష్యాల కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రఘు భావన ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన పలు గిరిజన సంఘాల నాయకులు ఆదివారం పార్టీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. గిరిజన సమాజం తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో రవి, కమటి, సుక్కు, ప్రియాంక, దేవా, శ్రీనివాస్, సేవ, వామ నాయక్, రమేష్, బాలు, మోతిలాల్, శంకర్, సురేష్, నితిన్, ప్రభాకర్, తిరుపతి, మల్లేష్, రాజ్య, హరి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్,క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బంధారపు నర్సయ్య,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీఆర్‌వీఎస్ ఏర్పాటు
ఆదివారం టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి సేన (టీఆర్‌వీఎస్)ను అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగాని హరి శంకర్ గౌడ్, పార్టీ జనరల్ సెక్రటరీ అశోక్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై పోరాటానికి, నిరక్షరాసులను చైతన్యం చేసి బీసీ రాజ్యాధికార దిశగా సమాజాన్ని నడిపించేందుకు టీఆర్‌వీఎస్ ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ విభాగం పూర్తిగా బీసీ బహుజన విద్యార్థుల ఉద్యమ వేదిక అని స్పష్టంచేస్తూ, రెడ్డి, వెలమ వర్గాలకు ఇందులో చోటు లేదని ప్రకటించారు.
బీసీ రాజ్యాధికార పోరాటంలో విద్యార్థులే ముందుండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఓదెలు యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్యగౌడ్, నాయకులు మార్త శ్రీనివాస్, పోలు రాజు, భద్రకాళి రమణచారీ, రంజిత్, భయ్య వెంకటేశ్వర్లు, దినకర్ ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.