30 April, 2026 | 3:06 AM

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి

22-04-2026 02:56 PM

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూశారు. చిట్టిబాబు మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజం పట్ల నిబద్ధతతో, నిరంతరం ప్రజా సమస్యలపై గళమెత్తే వారి మరణం సమాజానికి తీరని లోటు అని, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, విశ్లేషకుడిగా సినీరంగానికి విశేష సేవలందించారని కొనియాడారు.

➡️ ఇలాంటి తాజా సినీ వార్తల కోసం మా సినీ వార్తలు విభాగాన్ని ఫాలో అవ్వండి.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిరస్థాయిలో నిలిచిపోతారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని  భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కొండాపూర్ లోని సింధు హాస్పిటల్లో బుధవారం గుండెపోటుతో చిట్టిబాబు తుది శ్వాస విడిచారు. చిట్టిబాబు మృతిపట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్రిపురనేని చిట్టిబాబు తెలుగు సినీ రంగంలో నిర్మాతగా, విశ్లేషకుడిగా మంచి గుర్తింపు పొందారు. పలు చిత్రాలపై తన విశ్లేషణలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిట్టిబాబు మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

➡️ హైదరాబాద్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం మా హైదరాబాద్ వార్తలు చూడండి.


ఇవి కూడా చదవండి:

నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత

తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం

కొత్తగూడెంలో తీవ్ర విషాదం.. పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం