calender_icon.png 24 October, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం

24-10-2025 12:22:56 AM

నటుడు భూపతి, సంగీత దర్శకుడు సబేశన్ కన్నుమూత 

తమిళ సినీ ఇండస్ట్రీని విషాదం ఆవరించింది. నటుడు భూపతి (70), సంగీత దర్శకుడు ఎంసీ సబేశన్ (68) మరణవార్త ఒకేరోజు వినడంతో పరిశ్రమ వర్గాల్లో విషాదం నిండింది. మ్యూజిక్ డైరెక్టర్ సబేశన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, గురువారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నటుడు భూపతి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మరణించినట్టు సమాచారం. ప్రముఖ నటి, దివంగత మనోరమ తనయుడైన భూపతి పలు సీరియళ్లు, సినిమాల్లో నటించారు.

ఆయనకు భార్య ధనలక్ష్మి తోపాటు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భూపతి అంత్యక్రియలను చెన్నైలో శుక్రవారం నిర్వహించనున్నారు. సబేశన్ మురళి సోదర ద్వయానికి ‘జోడి’ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. 2001 నుంచి 2017 వరకు సంగీత దర్శకులుగా నిర్విరామంగా సేవలం దించారు. సబేశన్ కుమారుడు కార్తీక్ సబేశన్, మేనల్లుడు జై నటులు. సబేశన్‌కు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఈయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జరగనున్నాయి.