calender_icon.png 26 August, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచితోపాటు సన్నబియ్యం!

26-08-2025 12:09:02 AM

-కొత్త రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నుంచే..

-జిల్లాలో అదనంగా 3,674 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ 

నల్లగొండ టౌన్, ఆగస్టు 24 :రేషన్ షాపుల ద్వారా సరుకులను తీసుక వెళ్లేందుకు ప్రభుత్వం వచ్చే నెల నుంచి పర్యావరణహితమైన సం చులను సరఫరా చేయనున్నది.

ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు, పాత కార్డుల్లో చేర్పులు, మార్పుల్లో భాగంగా అదనంగా చేర్చిన కుటుంబ సభ్యులకు కూడా వచ్చే నెల నుంచి బియ్యం అందించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ మాసానికి గాను ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో గల రేషన్ వినియోగదా రులకు 3,674 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించింది.

విస్తృత ప్రచారంపై  సంచులు పంపిణీ..

రాష్ట్రంలో ఇస్తున్న సన్నబియ్యం గురించి, ప్రభుత్వం హామీ ఇచ్చిన అభయ హస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు రేషన్ కార్డులు కలిగిన వినియోగదారులకు సంచులను పం పిణీ చేయాలని నిర్ణయించారు. ఈ సంచులను 15 కిలోల వరకు సరుకులు పట్టే విధంగా తయారు చేశారు.

ఈ సంచులపై సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు, ఇందిరాగాంధీ ఫొటోతో గల అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి, గృహలక్ష్మి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా పేరిట గల లోగోను ముద్రించారు. అలాగే ‘అందరికి సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ప్రగతి పథం... సకలజన హితం... మన ప్రజా ప్రభుత్వం అనే ట్యాగ్ లైన్తో సంచులను ముద్రించారు.

రేషన్ షాపులకు వచ్చి పీఓఓస్ మిషన్లపై వేలి ముద్రలు వేసిన తర్వాత బియ్యంతోపాటు సంచులను కూడా అందజే యనున్నారు. ఈ సంచుల్లో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్న వాళ్లు మాత్రమే బియ్యం తీసుక పోవచ్చు. అనంతరం మార్కెట్కు సం చులను తీసుకువెళితే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నదనే ప్రచారం అవుతుందనే ఉద్ధేశ్యం తోనే సంచులను పంపిణీ చేసేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నది. సంచులు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరుకుంటున్నాయి.

కొత్త రేషన్ కార్డుదారులకు ఈనెల నుంచే..

రెండు, మూడు నెలల నుంచి కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారితోపాటు పాత కార్డుల్లో చేర్పులు, మార్పుల వల్ల కొత్తగా చేరిన కుటుంబ సభ్యుల పేరిట కూడా బియ్యం ఇవ్వనున్నారు. ఆ మేరకు డైనమిక్ కీ రిజిష్టర్ రూపొందించారు. వాటి ఆధారంగా జిల్లాలో 997  రేషన్ డీలర్లకు బియ్యాన్ని కేటాయించారు. భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు మూడు మాసాలకు కలిపి జూన్లో ఒకేసారి సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. జూన్ నెలకు ముందే మూడు నెలల అలాట్మెంట్ పూర్తి కాగా, జూన్ నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఈ నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.

జిల్లాలో కొత్తగా 8,750 కార్డులు...

నల్గొండ జిల్లాలో 4,66,061 రేషన్ కార్డులు ఉండగా, 13,85,506 యూనిట్లు ఉన్నాయి. ప్రజాపాలనలో 96 వేల అప్లికేషన్లు, బీసీ కుల గణన సందర్భంలో 30 వేల అప్లికేషన్లు, మీ సేవ కేంద్రాల్లో 19 వేల మంది అప్లై చేసుకున్నారు. వీటిలో స్క్రూట్నీ చేసిన తర్వాత జిల్లాలో కొత్తగా 8,750 కార్డులు మంజూరు చేశారు. దీంతో కొత్తగా 61,247 మంది లబ్ధిదారులు పెరిగారు. గతంలో 8,877 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, కొత్తగా 61,247 మందిని యాడ్ చేయడంతో 3,674 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేయనున్నారు.