calender_icon.png 16 January, 2026 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాలీబాల్ క్రీడల విజేతలకు బహుమతులు అందజేత

15-01-2026 12:06:34 AM

మాజీ ఎంపీటీసీ మాలోత్ అంకిత రవి నాయక్

మేడ్చల్ అర్బన్, జనవరి 14 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజ బొల్లారం తండాలో మాజీ ఎంపీటీసీ మాలోత్ అంకిత రవి నాయక్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడల టోర్నమెంట్ ను నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోత్ రవి నాయక్ మాట్లాడుతూ వాలీబాల్ క్రీడల టోర్నమెంట్ లో 5 టీం లు పాల్గొన్నాయని చెప్పారు.

వాలీబాల్ క్రీడలలో ప్రథమ బహుమతి పవన్ టీంకు ట్రోఫీతో పాటు 5000 వేల నగదు, రెండవ విజేతకు రన్నర్ అప్ ట్రోఫీతో పాటు 2000 నగదు బహుమతిని మాజీ ఎంపీటీసీ అంకిత రవి నాయక్ చేతుల మీదుగా అందజేసినట్లు చెప్పారు.యువతకు గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను నిర్వహిస్తే వారు మానసిక ఒత్తిడి లేకుండా చురుకుగా ఉండడమే కాకుండా చదువులతో పాటు ఆటలు కూడా మంచి విజయాలను సాధిస్తాయని రవి నాయక్ స్పష్టం చేశారు.రాజ బొల్లారం తండాలో నిర్వహించిన వాలీబాల్ క్రీడలకు సహకరించిన మాలోత్ సాయికుమార్,కరెంట్ రాజ్ కుమార్ లతో పాటు తండా పెద్దలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.