28-07-2025 12:00:00 AM
రూ.20వేలు ఆస్తి నష్టం, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన
కొత్తకోట జులై 27 : ఆరుగళ్ళం కష్టపడి పండించిన పంట చేతికి రా కపోవడంతో ఆ రైతు పడే భాద వర్ణించాలేం.. అలాగే కొత్తకోటలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. దింతో రైతు కన్నీరు మున్నిరై ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. కొత్తకోట మున్సిపల్ పరిధిలోని ఒకటవ వా ర్డుకు చెందిన రైతు వేముల రాజు తనకున్న పొలంలో 2ఎకరాలు వరి సాగు చేసుకున్నాడు.
శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వరి చేను పూ ర్తిగా నీటిలో కొట్టుకపోవడం జరిగింది. దింతో సుమారు 20 వేలు పం ట నష్టం జరిగిందని రైతు వేముల రాజును ప్రభుత్వం తరఫున ఆదు కోవాలని కోరారు. వివరాళ్లోకి వెళితే..కురుస్తున్న వర్షాలకు దాభ శ్రీను వెనుక గల శంకరసముద్రం కాలువ తెగి పోవడంతో అ నీరంతా వరి పంటలోకి చేరి పంట మొ త్తం నీటిలో కొట్టుకుపోయింది.
చేతికి వచ్చిన వరి పంట నష్టం అయ్యిందని ఈ విషయంపై ము న్సిపల్ కమీషనర్ స్పందించి తెగిపోయిన కాల్వ పనులను పూర్తి చేయించి రైతుల పంట పొలాలను కాపాడాలని కోరారు. అదేవిదంగా నష్టపోయిన నా పంటకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.