calender_icon.png 28 July, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిత్య ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం

28-07-2025 12:00:00 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు

హనుమకొండ టౌన్, జూలై 27 (విజయ క్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ నిరుప్ నగర్ తండా లో భూక్య వెంకటయ్య నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ బంక్ ను ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు.

తొలుత ఎమ్మెల్యే నాగరాజుని బంక్ యాజమాన్యం వారు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బంక్ యాజమాన్యం వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంక్ యాజమాన్యం, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.