calender_icon.png 15 November, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తత మాసంపై సమీక్ష

15-11-2025 08:55:22 AM

పెంచే స్థోమత లేని పిల్లల్ని దత్తత కోసం అప్పగించవచ్చు

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): పిల్లలను పెంచే స్థోమత లేనటువంటి తల్లితండ్రులు తమ పిల్లల్ని దత్తత కోసం అప్పగించవచ్చని జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. కొందరు తల్లితండ్రులు పిల్లలను రోడ్డు మీద వదిలేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఇలాంటి పిల్లల కోసం ఒక చక్కని మార్గాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దత్తత కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కాబట్టి ఎవరికైనా పిల్లలు పెంచే శక్తి లేనట్లయితే వారు వద్దు అనుకున్నట్లయితే పిల్లలని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రాలకు అప్పగించాలని, వారిని చట్ట ప్రకారం దత్తతకు పంపిస్తామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. దత్తత అవగాహన మాసం సందర్భంగా ఈ విధానం ఆమె సమీక్ష సమావేశం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించారు. దత్తత గురించి  సూచనలు అందించడం జరిగింది. 

ఎవరికైనా అవాంఛత గర్భం వచ్చినట్లయితే లేదా పెంచే శక్తి లేకుండా ఉన్నట్లయితే వారిని చెట్ల పొదలలో అక్కడ ఇక్కడ పడవ వేయడానికి బదులుగా ప్రభుత్వ నిర్దేశిత ప్రదేశాల్లో సరెండర్ చేయాలని, లేదా ప్రభుత్వం నిర్దేశిత స్థలాల్లో లేదా  బాలల సంక్షేమ సమితి సిడబ్ల్యుసి కి అప్పగించాలని సూచించారు. పిల్లలను అప్పగించినట్లయితే దేశంలో చాలామంది దత్తత కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు  చట్టప్రకారం అందించడం జరుగుతుందని తెలిపారు. దీంతో ఆ పిల్లలకు మంచి జీవితాన్ని, వెలుగులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మాసం దత్తత అవగాహన మాసం కాబట్టి ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం,జిల్లా బాలల హక్కుల అధికారి కవిత, ప్రొటెక్షన్ ఆఫీసర్ గగన్ పాల్గొన్నారు.