స్వచ్ఛ కలెక్టరేట్ మనందరి బాధ్యత
వివిధ శాఖల అధికారులకు నాలుగు రకాల డస్ట్‌బిన్స్ పంపిణీ: కలెక్టర్ ప్రతి మాసింగ్
మెదక్, జులై 6 (విజయక్రాంతి): స్వచ్ఛ కలెక్టరేట్ మనందరి బాధ్యత అని వ్యర్ధాలు సక్రమంగా వేరు చేయండి పరిశుభ్రమైన క లెక్టరేట్ గా తీర్చిదిద్దాలని. జిల్లా కలెక్టర్ ప్ర తిమా సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణి హాల్ నందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు అనుసరిస్తూ అధికారులకు అవగాహన కల్పిస్తూ జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నాలుగు ర కాల డస్ట్ బిన్స్ను అధికారులకు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కా ప్రణాళికతో కలెక్టరేట్ కార్యాలయాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రజలు కంకణబద్ధులై పని చే యాలన్నారు. ప్రతి కార్యాలయాల్లో నాలుగు డస్ట్ బిన్స్ అందుబాటులో ఉంచాలని ప్రత్యే క శ్రద్ధ తీసుకుని మీ కార్యాలయాల్లో పేర్కొ న్న చెత్తను వీరి వీరి గా సపరేట్ చేసి డస్ట్ బీన్స్ లలో వేయాలన్నారు. పర్యవేక్షణకు ప్రతి కార్యాలయంలో ఒకరు బాధ్యత తీసుకోవాలి అన్నారు.
ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా మెలిగి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం దిశగా భాగస్వామ్యం కావాలన్నారు. ఇంటి వద్దనే ఘన వ్యర్ధాలు నాలుగు విభాగాలుగా వేరుచేసి గ్రామపంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. నాలుగు రకాల చెత్త తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త ప్రత్యేక జాగ్రత్త చెత్త గా వేరుచేసి ఇవ్వాలని, తడి చెత్తకు ఆకుపచ్చ రంగు డస్ట్ బిన్, పొడిచేతకు బ్లూ కలర్ డస్ట్ బి న్, సానిటరీ చెత్తకు రెడ్ కలర్ డస్ట్ బిన్ మరియు ప్రత్యేక జాగ్రత్త చెత్తకు వాడా బ్లాక్ కలర్ డస్ట్ బిన్ లను వాడాలని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






