ప్రపంచ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం
కర్కపట్ల బయోటెక్ పార్క్లో సిరో ఫార్మా ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గజ్వేల్, జూలై 6: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల బయోటెక్ పార్క్లో ఏర్పా టు చేసిన సిరో ఫార్మా సంస్థను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మం త్రులు మాట్లాడారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు అవసరమైన ఔషధాలను తక్కువ ధరలో ప్రజ లకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఫార్మా రంగానికి ప్రభుత్వం అన్ని వి ధాలా సహకరిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2 వేల ఫార్మా కంపెనీలు పనిచేస్తుండగా, వాటిలో 260 కంపె నీలకు అమెరికా ఎఫ్డీఏ అనుమతులు లభించడం తెలంగాణ ఫార్మా రంగం నాణ్యతకు నిదర్శనమన్నారు. మంత్రి పొంగులేటి మా ట్లాడుతూ, ప్రపంచ ఫా ర్మా రంగంలో హైదరాబాద్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధిం చిందని, ఆ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నా రు. సిరో ఫార్మా వంటి పరిశ్రమలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.






