15-12-2025 01:15:30 AM
ముషీరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర పన్నుతున్నారనరి అందుకే ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇంతకుముందు 7,500 వరకు ఉన్న ఆర్టీసీ బస్సులను ఇప్పుడు 3500కు తగ్గించారని చెప్పారు.
దీంతో నగర ప్రజలు ప్రయాణాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రవాణా వ్యవస్థనే సరిగా లేనప్పుడు హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుందని సీఎం రేవంత్‌ను, కాంగ్రె స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ బస్సు ల పేరున ఆర్టీసీను ప్రైవేటు పరం చేసేందుకే ఈ ప్రయత్నాలు అని ఆరోపించారు. మెస్సీ తో ఫుట్‌బాల్ ఆట వల్ల తెలంగాణ ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉందో చెప్పాలని డిమాం డ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి గంట ఎంటర్‌టైన్ మెంట్ కోసం రూ.10 కోట్లు సింగరేణి బిడ్డల నిధి నుంచి ఖర్చు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి ఆ రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీంద్రభారతిలో బాల సుబ్రమ ణ్యం విగ్ర హం పెట్టే విషయంలో తెలంగాణ వాదుల పక్షానే ఉంటానని కవిత స్పష్టం చేశారు.