calender_icon.png 16 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో ముందస్తు మొక్కులు

15-12-2025 01:18:54 AM

భక్త జన సంద్రంగా సమ్మక్క, సారమ్మల గద్దెలు

మహబూబాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ  జాతరకు ముందుగానే భక్తులు ముందస్తు మొక్కులకు బయలుదేరారు. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావ డంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు సమర్పించుకోవడానికి మేడారం బాట పట్టారు. మేడారంలో ఓవైపు అభివృద్ధి పనులు జరుగుతుండగా మరోవైపు భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తూ ఒకవైపు సిమెంటు రోడ్డు వేసి మరోవైపు ఉన్న రోడ్డుపై ఇరువైపులా రాకపోకలు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో జంప న్న వాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకు వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసు లు దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగు లో ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాల వద్ద జల్లు స్నానం ఆచరించి, గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు.

జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ గద్దెల పైకి చేరి తల్లులకు ప్రణమిల్లి, మొక్కులు చెల్లించుకోవడానికి పోటీపడ్డారు. కోరిన కోరికలు నెర వేరడంతో తల్లులకు మేకలు, గొర్రెలు, కోళ్లు బలిచ్చారు. మేడారంలో నిద్ర చేయడానికి తాత్కాలికంగా నిర్మించిన గుడారాలు, నివాసాలు కిక్కిరిసిపోయాయి. సమ్మక్క సారల మ్మలకు చెల్లించే మొక్కుల్లో ప్రధానమైన నిలువెత్తు బంగారం (బెల్లం), కొబ్బరికాయ ల ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.