calender_icon.png 10 December, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి రహిత సమాజమే మనందరి లక్ష్యం

09-12-2025 08:03:21 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ (విజయక్రాంతి): అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో  పోస్టర్ ఆవిష్కరణ, ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అవినీతిని నిరోధిస్తామని అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ తో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనలో విద్యార్థి, యువత పాత్ర చాలా కీలకమని అన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్ ప్రీ నంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏసీబీ డి.ఎస్.పి విజయ్ కుమార్, ఇన్స్ స్పెక్టర్ కృష్ణ కుమార్, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.